Andhra Pradesh

స్వయంగా పింఛన్ అందిచనున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు-amaravati cm chandrababu distributes pensions on july 1st penumaka cs key orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


జులై 1న పెంచిన పెన్షన్లు పంపిణీ

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పెన్షన్ పంపిణీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను పెంచారు. గత ప్రభుత్వం రూ.3,000 పెన్షన్ ఇస్తే దాన్ని రూ.4,000కి పెంచింది. అలాగే గత మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా రూ.1,000 చొప్పున, జులైలో నెల రూ.4,000, గత మూడు నెలల రూ.3,000 మొత్తం రూ.7,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచారు. వికలాంగులకు, మల్టీడిఫార్మిటీ లెప్రసీలకు పెన్షన్ రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచారు.‌ పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు పెన్షన్ రూ.5,000 నుంచి రూ.15,000కు పెంచారు.‌ కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు.



Source link

Related posts

Waterbell in School: ఆంధ్రా స్కూళ్లలో వాటర్‌ బెల్.. వేసవిలో రోజుకు మూడుసార్లు నీళ్లు తాగాల్సిందే, విద్యాశాఖ ఆదేశాలు

Oknews

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు- టాలీవుడ్ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు-kurnool police filed case on sri reddy objectionable comments on chandrababu pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Jagananna Vidya Deevena: నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల.. బహిరంగ సభలో పాల్గొననున్న సిఎం జగన్

Oknews

Leave a Comment