EntertainmentLatest News

హీరో పెదవులు తాకగానే వాంతి చేసుకున్నాను 


హాలీవుడ్‌ మూవీస్‌లో లిప్‌ లాక్‌ సీన్స్‌ సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ విషయంలో ఇండియన్‌ సినిమాను కాస్త మినహాయించాల్సిందే. కొన్ని దశాబ్దాల క్రితం వరకు లిప్‌లాక్‌ సీన్స్‌ మన సినిమాల్లో ఉండేవి కాదు. రాను రాను మన సినిమాల్లోనూ మార్పులు వచ్చాయి. అప్పుడప్పుడు లిప్‌ లాక్‌ సీన్స్‌ దర్శనమిస్తుండేవి. ప్రస్తుతం ఆ విషయంలో హీరోలుగానీ, హీరోయిన్లుగానీ పెద్దగా అభ్యంతరం చెప్పట్లేదు. ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్స్‌ చెయ్యాలంటే హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడేవారు. కొందరైతే తాము చేసే సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే ఆ సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా వున్నాయి. 

తెరపై ముద్దు సీన్‌ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ, ఈ సీన్‌లో నటించే నటీనటులు ఆ సందర్భంలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మనం తెరపై ఒక్కసారే చూసే ఆ సీన్‌ను తీసేందుకు టేకులు కూడా తీసుకుంటారు. ఈ విషయంలో హీరోయిన్‌ రవీనా టాండన్‌ తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఈ న్యూస్‌ వైరల్‌గా మారింది. 1991లో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రవీనా తన అందచందాలతో కుర్రకారుని ఉర్రూతలూగించింది. సెక్సీ ఫిగర్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ముద్దు సీన్‌లో నటిస్తే.. ఇక రెస్పాన్స్‌ మామూలుగా ఉంటుందా? వాస్తవానికి ముద్దు సీన్స్‌లో నటించకూడదని ఒక నియమం పెట్టుకున్న రవీనా సిట్యుయేషన్‌ డిమాండ్‌ మేరకు అలాంటి సీన్స్‌లో నటించాల్సి వచ్చిందని చెబుతోంది. ఈ విషయంలో తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ.. ఒక సినిమాలో హీరోతో ముద్దు సీన్‌ చెయ్యాల్సిన అవసరం ఉందని డైరెక్టర్‌ చెప్పడంతో తన నియమాన్ని పక్కన పెట్టి లిప్‌లాక్‌ చెయ్యడానికి ఓకే చెప్పింది. షాట్‌ రెడీ అనగానే ముద్దు పెట్టుకునేందుకు సిద్ధమైంది రవీనా. కానీ, ఆ హీరో పెదవుల్ని తాకగానే ఆమెకు ఒక రకమైన ఫీలింగ్‌ కలిగింది. వెంటనే వెళ్ళి వాంతులు చేసుకుంది. అయితే అందులో ఆ హీరో తప్పేమీ లేదని, తనకే ఇబ్బంది కలిగిందని చెప్పింది. వందసార్లు నోటిని శుభ్రం చేసుకోవాలనిపించిందని చెప్పింది. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆమె వెల్లడిరచలేదు. 



Source link

Related posts

రెండో పెళ్లిపై నిహారిక కామెంట్స్ వైరల్

Oknews

Rashmika has increased her remuneration రష్మిక గట్టిగానే పెంచేసింది

Oknews

Producer S Naga Vamsi About Guntur Kaaram Success గుంటూరు కారం.. తప్పు చేశాం: నిర్మాత

Oknews

Leave a Comment