యాదమ్మరాజును పోలీసులు పట్టుకుపోయారు. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకున్నాడు …”ఏప్రిల్ 1 st కి ఒక ఇష్యూ అయ్యింది. నన్ను పోలీసులు పట్టుకునిపోయారు స్టేషన్‌కి. నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. నన్ను పోలీసులు ఎందుకు పట్టుకునిపోయారో ఏంటో”.. కింద లింక్ క్లిక్ చేస్తే అర్ధం అవుతుంది అని వీడియో పెట్టాడు యాదమరాజు. తీరా లింక్ ఓపెన్ చేస్తే అందులో “హూ ఈజ్ మై డాడీ” అనే థంబ్ నెయిల్ కనిపించింది. అదో వెబ్ సిరీస్. ఆ థంబ్ నెయిల్ లో ఒక స్పెర్మ్ బొమ్మ కూడా కనిపిస్తుంది. ‘‘వీడు ఎవరికి పుట్టాడో తెలీదు సార్.. అందుకే ఎవడికి పుట్టాడో తెలుసుకోవడానికే ఊరూరా తిరుగుతున్నాం’.. అంటూ తన డాడీ అని అనుకున్నవాళ్ళ మీద ఎవరెవరిపై అనుమానం ఉందో తనకు వాళ్లందరి వెంట్రుకల్ని డీఎన్ఏ పరీక్ష కోసం సేకరిస్తూ ఉంటాడు యాదమ్మరాజు. ఇలా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఐతే ఎప్పుడు ఏమిటి అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. దాంతో నెటిజన్స్ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ ని రాసి డైరెక్ట్ చేసింది రఘువీర్, ఇక ప్రొడ్యూస్ చేసింది జ్యోతక్క- గంగూలీ. ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేశారు. దాంతో అంతా నేచురల్ గా ఉంది. ఇక యాదమ్మ రాజు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చిన్నగా సీమ టపాకాయల దూసుకుపోతున్నాడు. ఆహా ఓటిటి మీద చెఫ్ మంత్ర సీజన్ 3 లో ఒక కామెడీ రోల్ చేస్తున్నాడు. వెబ్ సిరీస్ లో అటు శని, ఆదివారాల్లో వచ్చే ఈవెంట్స్ లో కనిపిస్తున్నాడు. యూట్యూబ్ లో ఫన్నీ వీడియోస్ కూడా చేస్తున్నాడు. మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కడ చూసిన యాదమ్మ రాజే కనిపిస్తున్నాడు.