Hyderabad Handicraft Exhibition : ఎంతో నైపుణ్యతతో హస్త కళాకృతులు తయారు చేసిన కళాకారులను గుర్తిస్తూ, ఆ కళలను బతికించాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను వారి కళలను కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లో తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంగడి క్రాఫ్ట్స్ కార్యక్రమాన్ని తెలంగాణ హండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారంజిత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… నాణ్యత, పనితనం, ధరలు అన్ని చూసి వారి కళను ప్రోత్సహించే విధంగా తమ కౌన్సిల్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో వారికి ఉచితంగా స్టాల్ ను పెట్టుకునేందుకు అన్ని విధాల సహకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల కళాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు.