అసలేం జరిగిందంటే…..హైదరాబాద్ నగరానికి చెందిన మొహమ్మద్ ఉల్ర హమాన్ చాదర్ ఘాట్ లోని అక్బర్ చౌరస్తాలో కిస్వా జ్యువెలర్స్ పేరుతో వెండి, బంగారం నగల విక్రం దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఉల్ రెహమాన్ కుమారుడు సాజవుర్ రెహమాన్ దుకాణంలో ఉన్నాడు.మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దుకాణానికి వచ్చిన ఓ యువకుడు తనకు వెండి గొలుసు కావాలని రెహమాన్ ను అడిగాడు.దీంతో అతను గొలుసులు చూపిస్తున్నడు.ఈ క్రమంలోనే ముఖానికి మస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు…….నెంబర్ ప్లేట్ లేని ఓ ద్విచక్ర వాహనంపై వచ్చి దుకాణం వద్ద ఆగారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారే దుకాణం లోపలకి ప్రవేశించి తమ వద్ద ఉన్న కత్తులు బయటకు తీశారు. వెండి గొలుసులు పరిశీలిస్తున్న కస్టమర్ ను పక్కకు తోసేసి సజావురుపై కత్తితో దాడికి యత్నించారు. దుండగులను అడ్డుకునే క్రమంలో ఆయన ఎడమచేవి ,ఎడమ చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి.దాంతో సజావుర్ కింద పడిపోయాడు.అప్పటికే తమ వెంట తెచ్చుకున్న సంచి లో బంగారు ఆభరణాలు సంచి లో వేసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
Source link