EntertainmentLatest News

అవార్డులు అందుకున్న మూవీని పట్టించుకోని ఓటీటీ సంస్థలు.. కారణం అదేనా!


 

ఓ సినిమాకి ఇంత గడ్డుకాలమా అనేలా సాగుతుంది. ఏ ఓటీటీ సంస్థ ఆ సినిమాని స్ట్రీమింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. అసలేంటి ఆ సినిమా? ఎందుకు ఏ ఓటీటీ వేదిక ముందుకు రావడం లేదో ఓసారి చూసేద్దాం.

 ది బ్రిటెల్ థ్రెడ్ ( The Brittle Thread) .. జీనీ బీని చడారియా అనేది ట్యాగ్ లైన్. రితేశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘ మాథుర్, ముజఫర్ ఖాన్, శివన్ స్పెక్టర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వారణాసి ప్రాంతంలోని ప్రజల జీవనశైలి, అక్కడి పరిస్థితులు, సంప్రదాయాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ లోకల్ గా ఉండే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయి. అయితే ఈ గొడవలు, అల్లర్లు కొంతమంది రాజకీయ నాయకులకు లింకప్ అయ్యేలా ఉన్నాయని ఓటీటీ సంస్థలు  భావించాయి. ఒకవేళ ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకుంటే ఆ సంస్థకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అందుకేనేమో రిలీజ్ చేయడానికి ఏ ఓటీటీ వేదిక ముందుకు రావడం లేదు. 2021 నుండి జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజ్ అవ్వలేదు.

ఈ మూవీ దర్శకుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  ఇది నేను ఊహించిందే.. రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాని కొనే సాహసం తాము చేయలేమని ఓటీటీలు చెబుతున్నాయని రితీశ్ శర్మ తన అకౌంట్ లో ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సినిమాకి సపోర్ట్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 



Source link

Related posts

Revanth Reddy participating 87th Jayanthi Celebrations of Duddilla Sripada Rao at Ravindra Bharathi

Oknews

రష్మిక మాజీ లవర్ పై పోలీసు కేసు..ప్రెజంట్ రాష్ట్రం బయటే ఉన్నాడు

Oknews

Pushpa 2: That’s not true పుష్ప 2: అది నిజం కాదట

Oknews

Leave a Comment