EntertainmentLatest News

ఈటీవీ విన్‌ సహకారంతో డ్రీమ్‌ ఫార్మర్స్‌ ప్రొడక్షన్‌ నెం.4 ప్రారంభం


ప్రియమణి నటించిన భామాకలాపం ఫ్రాంచైజీ, విశ్వక్‌ సేన్‌ అశోక వనంలో అర్జున్‌ కళ్యాణం సినిమాలతో డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్రాండ్‌ పెరిగింది. అలాంటి ప్రొడక్షన్‌ కంపెనీ నుంచి మరో కొత్త చిత్రం రాబోతోంది. ఈరోజు ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈటీవీ విన్‌ సహకారంతో డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్‌ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్‌ నటుడు నరేష్‌ విజయ్‌కృష్ణ, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలు పోషించనున్నారు. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 25న పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టును  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు రవికిరణ్‌ కోలా, రాధాకృష్ణ, భరత్‌ కమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ తన్మయ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, చిత్రనిర్మాత రాధ క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రానికి అనురాగ్‌ పాలుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌ హెచ్‌ విక్రమ్‌ సంగీతం అందిస్తుండగా అంకుర్‌ సి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. హరీష్‌ శంకర్‌ టిఎన్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఈటీవీ విన్‌ గురించి..

2019లో ప్రారంభించబడిన ఈటీవీవిన్‌ వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్‌ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన ప్లాట్‌ఫామ్‌గా వేగంగా స్థిరపడిరది. ఈ యాప్‌ ప్రారంభం నుంచీ ప్రేక్షకులకు సాటిలేని వినోద అనుభవాన్ని అందిస్తున్నారు.



Source link

Related posts

Jogaiah Writes Open Letter To Pawan Kalyan పవన్‌ను ఏకిపారేసిన హరి రామజోగయ్య!

Oknews

BRS chief KCR participates in Kadanabheri public meeting in Karimnagar | KCR Speech: తెలంగాణ ప్రజలు మోసపోయిన్రు, సీఎం మాటలు మనకు గౌరవమా?

Oknews

ఖచ్చితంగా సంతోషపెడతాను అంటున్న తెలుగు హీరోయిన్

Oknews

Leave a Comment