EntertainmentLatest News

ఈ శుక్రవారం పది సినిమాల మైకంలో తెలుగు ప్రజలు  


వారానికి ఏడు రోజులు అన్నది ఎంత నిజమో ఆ ఏడు రోజుల్లో వచ్చే శుక్రవారం కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు  ఎదురు చూస్తు ఉంటారనేది కూడా అంతే నిజం.హీరో ఎవరన్నది అనవసరం శుక్రవారం బొమ్మ పడటం ఆలస్యం ఏ సినిమా బాగుందో  ఎంక్వరీ  చేసి మరి థియేటర్స్ ముందు బారులు కడతారు.అసలు కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటనే మూవీ లవర్స్ కి పండగ వచ్చినంత సంబరంగా భావిస్తారు. తాజాగా ఈ శుక్రవారం వాళ్ళ సంబరం రెట్టింపు కాబోతుంది 

ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 2 న ఒకటి కాదు రెండు కాదు మొత్తం  పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.ప్రేక్షకులని సినీ మైకంలో ముంచడానికి వస్తున్న ఆ సినిమాల లిస్ట్ ఈ విధంగా ఉంది. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, బూట్ కట్ బాల రాజు, కిస్మత్,ధీర,గేమ్ ఆన్, హ్యాపీ ఎండింగ్, మెకానిక్, ఉర్వి, చిక్ లెట్స్, శంకర ఇలా మొత్తం పది చిత్రాలు ప్రేక్షకులని కనువిందు చేయనున్నాయి. ఈ చిత్రాలన్నీ కూడా మంచి కంటెంట్ తో రూపుదిద్దుకొని ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి. 

 

సినిమా పరిశ్రమలో జయాపజయాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా డిజాస్టర్ అవుతుందో ఆ శుక్రవారమే తేలిపోతుంది.కాకపోతే  అన్ని సినిమాలు ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం.అలాగే నెక్స్ట్ శుక్రవారం వచ్చే అంటే తొమ్మిదవ తేదీన మాస్ మహారాజా రవితేజ నటించిన  ఈగిల్  రజనీకాంత్ లాల్ సలాం మమ్ముట్టి యాత్ర లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలుని తట్టుకొని ఏ సినిమాలు నిలబడతాయో చూడాలి.

 



Source link

Related posts

Budget 2024 Expectations these are the things that people expect most from the Interim budget 2024

Oknews

Speculation on Ravi Teja next రవితేజ లైనప్ చూసారా..

Oknews

 సోలో హీరోగా రెండు సినిమాలతో టాలీవుడ్‌ ఎంట్రీ!

Oknews

Leave a Comment