తల్లిదండ్రులు బాధపడతారనేమాళవిక హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ (RPF SI)పరీక్ష రాసింది. కంటి సమస్య కారణంగా ఆమె వైద్య పరీక్షల్లో క్వాలిఫై కాలేకపోయింది. అయితే ఫేక్ ఐడీ కార్డు(Fake ID Card), యూనిఫామ్ తో శంకర్ పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు మాళవిక అందరినీ నమ్మించింది. తనకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు బాధపడుతుండడంతో ఆమె ఇలా నకిలీ అధికారి అవతారం వేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్పీఎఫ్ యూనిఫామ్ ధరించి మాళవిక కొన్ని రీల్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Source link