టీజీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షలకు తేదీలు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటన చేశారు. గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్షల తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 24 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు 3 రోజుల ముందుగా హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖలో గ్రేడ్-I, గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారి గ్రేడ్-II, షెడ్యూల్డ్ కులాభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వార్డెన్ గ్రేడ్-I, గ్రేడ్-II, మాట్రాన్ గ్రేడ్-I, గ్రేడ్-II, వికలాంగులు & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డైరెక్టర్, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్‌లో పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ రిక్రూట్‌మెంట్ ఖాళీలకు మల్టీషిఫ్ట్‌లలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ విధానంలో నిర్వహించనున్నారు.