AP TET Notification : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET 2024) నోటిఫికేషన్ విడుదలైంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో మరోసారి టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 2 నుంచి ఆన్ లైన్ లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీ టెట్ నోటిఫికేషన్, తేదీలు, సిలబస్ ఇతర పూర్తి వివరాలను https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఏపీ టెట్ సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.