ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. జనవరి 22న స్కూల్స్ తిరిగి ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.