టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, తర్వాత కూడా పలు కాంపిటీషన్స్ లో రాణించినా.. నీరజ్ ఇప్పటికీ 90 మీటర్ల మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే దూరాన్ని తాను పెద్దగా పట్టించుకోనని అతడు చెబుతున్నాడు. “100 శాతం ఫిట్ గా ఉండటంపైనే దృష్టి సారిస్తాను. సీజన్ మొత్తం నిలకడగా రాణిస్తూ ఆ రోజు లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యం. కొన్ని తప్పిదాలను ఇంకా సరి చేసుకోవాల్సి ఉంది” అని నీరజ్ అన్నాడు.