ముగ్గురు స్నేహితులు ఒకేసారిమాసాన్ పల్లి ప్రమాదంలో జోగిపేటకు (Jogipet)చెందిన ముగ్గురు యువకులు వాజిద్, హాజీ, ముఖ్రం చనిపోవడంతో ఆయా కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి. జోగిపేటకు చెందిన వాజిద్ తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు, ఇతడు ఒక్కడే కుమారుడు. కాగా అతడికి సంవత్సరం కిందటే వివాహ జరగగా ప్రస్తుతం అతని భార్య గర్భవతి. పదేళ్లుగా జోగిపేటలో బైక్ మెకానిక్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో వాజీద్ మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. హాజీ ఏసీ మెకానిక్ గా పనిచేస్తుండగా, ముఖ్రం చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ముగ్గురు స్నేహితులు ఒకేసారి రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో జోగిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Source link