కాంగ్రెస్ డర్టీ గేమ్
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజల్ని ధైర్యంగా అడుగుతున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యా, వైద్య, పాలనా రంగాల్లో సంచలన మార్పులు తీసుకువచ్చిందన్నారు. అవినీతికి ఆస్కారంలేకుండా, పారదర్శకంగా పాలన చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. ఆనాడు అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా బాబాయ్‌ను మంత్రిగా చేసి నాకు వ్యతిరేకంగా పోటీ చేయించారన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలను నాపై ప్రయోగించిందన్నారు.