నగరానికి గుర్తింపు దక్కడం హర్షణీయం- మేయర్ గుండు సుధారాణికేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఛాలెంజ్ కు వరంగల్ ఎంపిక కావడం హర్షనీయమని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గుండు సుధారాణి అన్నారు. దేశవ్యాప్తంగా 84 స్మార్ట్ సిటీ నగరాల్లో వరంగల్ కు కూడా చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ కు దేశంలోని ఫాస్ట్ మూవింగ్ సిటీస్ లో చోటు దక్కిందని, భవిష్యత్తులో మిగిలిన పథకాలలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తామని మేయర్స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో గ్రేటర్ వరంగల్ ను ముందంజలో నిలిపే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ ఛాలెంజ్ ఒక మైలురాయిగా నిలుస్తుందని మేయర్ గుండు సుధారాణి చెప్పుకొచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిపుణులు, అధికారుల సలహాలు తీసుకుని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తామని మేయర్స్పష్టం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఛాలెంజ్ కు వరంగల్ నగరం ఎంపిక కావడంతో గ్రేటర్ అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఛాలెంజ్ లో నెగ్గి నగర అభివృద్ధి లో భాగస్వాములు కావడంతో పాటు మరిన్ని నిధులతో గ్రేటర్ వరంగల్ ను దేశంలోనే అగ్ర భాగంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
Source link