దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్ దాటుకుని పండుగలన్నీ పూర్తయ్యే దాకా బాబు రాజమండ్రిలోనే ఉండాల్సి రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుంచి చంద్రబాబు బయటపడినా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు, అంగళ్లు ఘర్షణల కేసుల నుంచి కూడా చంద్రబాబు బయట పడాలి. ఏక కాలంలో ఇన్ని కేసుల నుంచి ఉపశమనం వేగంగా లభించడంపైనే సందేహాలు నెలకొన్నాయి. వీటితో పాటు కొత్త కేసులు నమోదు చేసే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. చంద్రబాబును బయటకు రానివ్వకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తే మరిన్ని కేసుల్ని టీడీపీ అధినేత ఎదుర్కోవాల్సి రావొచ్చు.