వచ్చే ఎన్నికల్లో 4 సీట్లు
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ను కూడా జగన్ అరెస్టు చేసేందుకు వెనుకాడరని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించిన ఆయన… సీఎం జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు నాలుగు సీట్లు కూడా రావని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.