Tirumala Tirupati Devasthanams News: కొత్త సంవత్సరం జనవరిలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే దర్శన టికెట్లకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు వివరాలను పేర్కొంది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం… 2024 జనవరి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది.