EntertainmentLatest News

‘జై లవ కుశ’ రికార్డు బ్రేక్ చేసిన ‘పుష్ప-2’ టీజర్!


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 : ది రూల్’. 2021 డిసెంబర్ లో విడుదలై సంచలనం సృష్టించిన ‘పుష్ప: ది రైజ్’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడంతో ‘పుష్ప-2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 110 మిలియన్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న ‘పుష్ప-2’ టీజర్.. ఏడేళ్లుగా ‘జై లవ కుశ’ పేరు మీదున్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది.

ఒకప్పుడు సినిమా వసూళ్ల రికార్డులను మాత్రమే పట్టించుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో టీజర్, ట్రైలర్ రికార్డులను కూడా పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ మూవీ టీజర్ యూట్యూబ్ లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఏకంగా 137 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ఏడేళ్ల తర్వాత ‘పుష్ప-2’ బ్రేక్ చేసింది. ‘పుష్ప-2’ టీజర్ 138 గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయింది. ‘పుష్ప-2’, ‘జై లవ కుశ’ తర్వాతి స్థానాల్లో..  134 గంటలతో ‘జనతా గ్యారేజ్’, 123 గంటలతో ‘సరిలేరు నీకెవ్వరు’, 120 గంటలతో ‘కాటమరాయుడు’, ‘రంగస్థలం’, ‘అరవింద సమేత’ ఉన్నాయి.



Source link

Related posts

మణిరత్నం గీతాంజలి అనుకున్నానే.. కాదు.. కోన వెంకట్‌ గీతాంజలివే.. దెయ్యంలా తగులుకున్నావ్‌!

Oknews

Padi Kaushik Reddy Auto Ride to Assembly : అసెంబ్లీకి ఆటోలో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి |ABP

Oknews

ఎన్టీఆర్ అభిమానికి నిర్మాత ఎస్.కె.ఎన్ సాయం

Oknews

Leave a Comment