Tirupati SV Zoo Park Incident: తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడిన ఓ వ్యక్తి…. సింహతో సెల్ఫీ ట్రై చేశాడు. ఈ సమయంలో ఒక్కసారిగా సింహం దాడి చేసేందుకు ప్రయత్నించింది. భయపడిన అతను… చెట్టుపైకి ఎక్కగా దానిపై నుంచి కిందపడటంతో సింహం అతని తల భాగంపై దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.దాడి చేసిన సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్ బంధించారు.