దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలోఏపీలోనూ ఎండలు(AP Weather Report) దంచికొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఈ నెల 27 వరకు రాయలసీమ(Rayalaseema High Temperatures) జిల్లాల్లో ఎండ వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. విజయవాడలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకూ రికార్డు అవుతున్నాయి. రానున్న 5 రోజులు రాయలసీమతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో రాయలసీమలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు.
Source link