193 మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశాలు
2022-23లో 69 మంది విద్యార్థులకు, 2021-22లో 124 మొత్తంగా 193 మందికి నకిలీ ధ్రువపత్రాలతో పాఠశాలలో ప్రవేశాలు కల్పించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మే 3, 4 తేదీల్లో సీబీఐ అధికారులు వాల్తేరు కేంద్రీయ విద్యాలయ స్కూల్ లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రిన్సిపల్ శ్రీనివాస రాజా ఫేక్ సర్టిఫికేట్లతో అర్హతలేని విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించినట్లు గుర్తించారు. ప్రిన్సిపల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సీబీఐ అధికారులు… విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ విషయంపై ఆరా తీసిన సీబీఐ అధికారులు… ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసింది. కేంద్రీయ విద్యాలయ కమిషనర్ నుంచి అనుమతి పొందిన తీసుకున్న ప్రినిపల్ శ్రీనివాస రాజాపై తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.