Andhra Pradesh

నేటి నుంచి ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు జారీ, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-amaravati news in telugu ap inter exams hall tickets 2024 released exam dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP Inter Hall Tickets : నేటి ఇంటర్ హాల్ టికెట్లు(AP Inter Hall Tickets) విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లను సిద్ధం చేసింది. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాజరును ఆన్ లైన్ లో నమోదుచేసేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. గత ఏడాది పరీక్ష పేపర్ల లీక్ (Paper Leak)వివాదంతో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్ష పేపర్లకు క్యూఆర్‌ కోడ్‌ను జతచేసింది. దీంతో ప్రశ్నాపత్రాన్ని ఎక్కడైనా ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను నిషేధించారు. ఈ ఏడాది 10,52,221 మంది ఇంటర్ పరీక్షలకు(AP Inter Exams) ఫీజు చెల్లించారు. వీరిలో 4,73,058 మంది ఫస్టియర్, 5,79,163 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ పరీక్ష పేపర్లను స్థానిక పోలీస్ స్టేషన్ లో భద్రపరచనున్నారు.



Source link

Related posts

తెలుసు కదా.. ఏకథాటిగా 30 రోజులు

Oknews

Vizag ARO Agniveer Recruitment 2024 : 'అగ్నివీరుల' నియామకానికి ARO వైజాగ్ నోటిఫికేషన్ – ముఖ్య వివరాలివే

Oknews

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడికి సుప్రీంలో ముందస్తు బెయిల్-anticipatory bail in supreme court for president of government employees union ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment