రేస్ వాకర్లు ప్రియాంక గోస్వామి, అక్షదీప్ సింగ్ 2024 పారిస్‌లో అథ్లెటిక్స్ ఈవెంట్లకు అర్హత సాధించిన తొలి భారతీయులుగా నిలిచారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో నలుగురు భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ స్టాండర్డ్‌ను అధిగమించగా, ఒకరు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కానీ ప్రతి జాతీయ సమాఖ్య ఈ ఈవెంట్లో గరిష్టంగా ముగ్గురు అథ్లెట్లను మాత్రమే పారిస్‌కు పంపగలదు. కాబట్టి అక్షదీప్, వికాస్, పరంజీత్ సింగ్ అనుమతి పొందారు. రామ్ బాబూ, సూరజ్ పన్వర్ తప్పుకున్నారు. మిక్స్ డ్ రిలే మారథాన్ రేస్ వాక్ ఈవెంట్ లో ప్రియాంక, అక్షదీప్ లకు భారత్ తరఫున కోటా లభించింది.