రిజిస్ట్రేషన్ ప్రారంభం
విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. cse.ap.gov.in వెబ్ సైట్ లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తల్లిదండ్రుల గుర్తింపు కార్డు(ఆధార్, ఓటర్, రేషన్, భూహక్కు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, పాస్‌పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్లు, రెంటల్ అగ్రిమెంట్ కాపీ) ఒక దానిని యాడ్ చేయాలి. ప్రైవేట్ పాఠశాల్లో ప్రవేశాలకు రిజస్టర్ చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులను మార్చి 20 నుంచి 22 వరకు అధికారులు పరిశీలిస్తారు. ఏప్రిల్ 1న లాటరీ విధానంలో అర్హులైన విద్యార్థుల తొలి లిస్ట్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి 10 వరకు విద్యార్థుల అడ్మిషన్లు ఫైనల్ చేసి ఏప్రిల్ 15న లాటరీ ద్వారా రెండో లిస్ట్ ప్రకటిస్తారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు వివిధ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు ఖరారు చేస్తారు అధికారులు. ఈ అవకాశాన్ని అర్హులైన పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.