Proddatur Gold Shops : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో నాలుగు బంగారం దుకాణాల్లో సరైన బిల్లులు లేని సుమారు 300 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి, విజయవాడకి చెందిన ఐటీ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలతో పాటు గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి తరలించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సరైన బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు తనిఖీల్లో ఐటీ అధికారులు గుర్తించారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు పైగా ఉన్నాయి.