Andhra Pradesh

భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలో భర్త అమానుషం!-east godavari crime news in telugu husband tonsures wife rounding in streets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ

మూడు రోజుల క్రితం పెదకొండేపూడిలోని తన భర్త ఇంటికి వెళ్లింది ఆషా. ఇంటికి వచ్చిన ఆషాపై అభిరామ్ ఒక మృగంలా పైశాచికంగా వ్యవహరించాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడి చేసి ట్రిమ్మర్ తో ఆమెకు గుండు గీశాడు. ఆ తర్వాత ఆ జట్టును ఒక చేతితో పట్టుకుని, ఆమెను మరో చేతితో లాక్కుంటూ ఊరంతా హల్ చల్ చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు, అక్కడికి చేరుకుని బాధితురాలికి చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు అభిరామ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించింది. ప్రేమించి పెళ్లి చేసుకుని షేక్‌ ఆషా అనే మహిళను మోసం చేయడమే కాకుండా, శిరోముండనం చేసి ఇంటి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి అమానుషంగా ప్రవర్తించి, చంపుతానని బెదరింపులకు దిగడంతో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండుకు పంపించినట్లు సీతానగరం ఎస్సై రామకృష్ణ తెలిపారు.



Source link

Related posts

Vijayawda Mp Issue: నిన్నటి దాకా వైసీపీ ఎస్సీ, బీసీ రాగం.. ఇప్పుడు ఓసీ పాట..!

Oknews

ఏపీలో సునీల్ కనుగోలు ఎంట్రీ..! షర్మిల తరపున వ్యూహ‍రచన?-sunil kanugolus team will strategize for the congress party in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రాజకీయాల్లోకి కోడికత్తి శ్రీనివాస్…జై భీమ్‌రావ్ భారత్ పార్టీలో చేరిన శ్రీనివాస్-kodikatti srinivas joins politics srinivas joined jai bhimrao bharat party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment