EntertainmentLatest News

రష్మిక ఇకపై సినిమా చెయ్యాలంటే ఇంత ఇవ్వాల్సిందే! 


2018లో  వచ్చిన ఛలో మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన నటి రష్మిక. మొదటి సినిమాతోనే  అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో  అనతి కాలంలోనే  అగ్ర  కథానాయకిగా ఎదిగింది. తాజాగా ఆమె పారితోషకంకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

రష్మిక ఇకపై  కొత్తగా ఒప్పుకునే సినిమాలకి తన పారితోషకంగా 4 కోట్లు దాకా డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమో అబద్దమో తెలియదు గాని రష్మిక మాత్రం  4 కోట్లు దాకా అడుగుతుందనే రూమర్ ఒకటి  ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశ మయ్యింది. ఆల్రెడీ తను ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయిన ది గర్ల్ ఫ్రెండ్  సినిమాలకి 3 కోట్లు  పారితోషకాన్ని తీసుకుంటుంది. మరి ఇక పై ఒప్పుకునే కొత్త సినిమాలకి 4 కోట్లు డిమాండ్ చేస్తుందనే విషయంపై మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

 

సౌత్ లో ఇప్పటివరకు 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళ జాబితాలో సమంత, పూజాహెగ్డే లు ఉన్నారు. ఇప్పుడు  రష్మిక వాళ్ళని దాటి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే మాత్రం నిజంగా వండర్ అని చెప్పాలి. సోషల్ మీడియా లో ఈ వార్తలని చూస్తున్న కొంత మంది అయితే  పుష్ప  పార్ట్ 1  అండ్ యానిమల్ తో  ఒక్క సారిగా రష్మిక రేంజ్  నేషనల్ లెవల్లో పెరిగిపోయింది కాబట్టి ఆమె అంత డిమాండ్ చెయ్యడంలో తప్పులేదని అంటున్నారు.  మరికొంత మంది  దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతని గుర్తు చేస్తున్నారు.



Source link

Related posts

దర్శకుడు శ్రీను వైట్ల వీడియో వైరల్ 

Oknews

లోకేష్ కనగరాజ్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ ఏది?

Oknews

Kodali Nani Shocking Comments on Jr NTR ఎన్టీఆర్ ని బయటికి తోసేస్తారు

Oknews

Leave a Comment