జేబుకు చిల్లు తప్ప గుర్తింపు లేదుసైబర్ నేరాల్లో(Cyber Crimes) భాగంగా…..ఇతర రాష్ట్రాల్లో దాక్కున నిందితులను పట్టుకునేందుకు విచారణ అధికారులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాచకొండలో ఈ ప్రక్రియ మూలన పడింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే నాలుగైదు రోజులు అక్కడ ఉండాలంటే జేబుకు చిల్లు తప్ప ప్రయోజనం ఉండడం లేదని పలువురు పోలీసులు అధికారులు వాపోతున్నారు. ఒకవేల కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్ తరలిస్తే ఉన్నతాధికారులు దృష్టిలో గుర్తింపు ఉంటుందా? అంటే అదీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ఇతర విభాగంలో డ్యూటీ చేయడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి , పని భారం పెరిగిందని, కేసులు దర్యాప్తు వేగంగా పారదర్శకంగా చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమ కెరీర్ కి ఇబ్బంది అవుతుందని అధికారులు భయపడుతున్నారు.
Source link