పాలేరు పాతకాలువకు నీరివ్వాల్సిందే…పాలేరు పాతకాలువ ఆయకట్టు పరిధిలో 14,500 ఎకరాలుండగా దానిలో 7వేల ఎకరాల్లో యాసంగి వరి, చెరకు తదితర పంటలు సాగయ్యాయని వీటికి నీరు ఇచ్చేలా ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను ఆరోగ్యం ఎంత సీరియస్ కండీషన్ కు వెళ్లిందో అంత త్వరగా కోలుకున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు తమ్మినేనికి సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
Source link
previous post