డాక్టర్లను కలిసేంత వరకు అందరిలా క్యూ లైన్లలో వేచి ఉండటం, డాక్టర్లను సంప్రదించేంత వరకు ఓపిగ్గా ఉండటం దివ్యాంగులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. దీంతోనే దివ్యాంగుల అవస్థలను గుర్తించిన ఎంజీఎం సూపరింటెండెంట్ డా.వి.చంద్రశేఖర్ ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎంజీఎం ఆర్ఎంవోలు, ఇతర డాక్టర్ల సలహాలు, సూచనలతో ప్రత్యేక ఓపీకి శ్రీకారం చుట్టారు.