EntertainmentLatest News

విడుదలకు ముందే ‘టిల్లు స్క్వేర్’ సంచలనం.. ఓటీటీ రైట్స్ కి అన్ని కోట్లా..!


ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన తెలుగు సినిమాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. 2022 ఫిబ్రవరిలో విడుదలైన ఈ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యువతకి.. ఈ సినిమా, ఇందులోని టిల్లు పాత్ర ఎంతగానో చేరువయ్యాయి. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతుంది.

‘డీజే టిల్లు’ ప్రభావంతో ‘టిల్లు స్క్వేర్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల తేదీ పలుసార్లు మారినప్పటికీ.. అంచనాలు ఏమాత్రం తగ్గడంలేదు. బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.35 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక కుర్ర హీరో సినిమా ఓటీటీ రైట్స్.. ఈ స్థాయిలో అమ్ముడవ్వడం రికార్డు అని చెప్పవచ్చు. ‘డీజే టిల్లు’కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ తోనే.. సీక్వెల్ రైట్స్ రికార్డు ప్రైస్ కి అమ్ముడయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29 విడుదల కానుంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తే.. హీరో సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ ఒక్కసారిగా పెరిగే అవకాశముంది.



Source link

Related posts

BRS leader Krishank criticized that cases are being filed on social media posts | BRS : కేసులు పెట్టి ఫోన్లు తీసుకుంటున్నారు

Oknews

ఓటీటీలోకి 'సుందరం మాస్టర్'..!

Oknews

Bajireddy Govardhan,Loksabha Elections,Nizamabad, Brs, Bjp, Telangana, Dharmapuri Arvind

Oknews

Leave a Comment