Andhra Pradesh

విన్న‌పాలు ఆల‌కించాలంటున్న జ‌గ‌న్‌ Great Andhra


అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ య‌థేచ్ఛ‌గా దాడుల‌కు పాల్ప‌డుతోంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని కూడా అనుమ‌తుల్లేవ‌నే కార‌ణంతో ప్ర‌భుత్వం కూల్చేసింది. కూల్చివేత‌తో పాల‌న మొద‌లు పెట్టార‌నే అప‌ప్ర‌ద‌ను ప్ర‌భుత్వం మూట‌క‌ట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో వినుకొండ‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌ను రషీద్‌ను చంప‌డం, అలాగే పుంగ‌నూరులో రాజంపేట ఎమ్మెల్యే మిధున్‌రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్ట‌డం, ఆయ‌న కారును కాల్చివేయ‌డాన్ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇలాగైతే వైసీపీ శ్రేణులు మ‌నో స్థైర్యాన్ని కోల్పోతాయ‌నే భ‌యం జ‌గ‌న్‌ను వేటాడుతోంది. దీంతో ఆయ‌న పోరాటానికి శ్రీ‌కారం చుట్టారు.

ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ నెల 24న ధ‌ర్నాకు పిలుపు ఇచ్చారు. అలాగే ఇవాళ సాయంత్రం ఐదు గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌ను జ‌గ‌న్ క‌ల‌వ‌నున్నారు. గ‌త 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛ‌నీయ ప‌రిణామాల్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు.

శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యాయ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ నేతృత్వంలో ఫిర్యాదు చేయ‌నున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ సాగిస్తున్న అరాచ‌కాల‌ను అరిక‌ట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు జ‌గ‌న్ విన్న‌వించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన త‌ర్వాతైనా ప‌రిస్థితుల్లో ఏ మేర‌కు మార్పు వ‌స్తుందో చూడాలి.



Source link

Related posts

అరకు లోయలో ఘోర ప్రమాదం.. బైక్స్ ఢీకొని నలుగురు మృతి , విషమంగా మరో ఆరుగురి పరిస్థితి..!-four killed as 4 bikes collide with each other at araku valley in alluri sitharama raju district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్, తెలంగాణల నేడు, రేపు భారీ వర్షాలు, పోటెత్తుతున్న గోదావరి-red alert for four districts heavy rains in telangana today and tomorrow flowing godavari ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వాలంటీర్లు లేకున్నా సజావుగా పెన్షన్ల పంపిణీ, వారికి ప్రత్యామ్నయ ఉపాధి చూపిస్తామన్న పవన్ కళ్యాణ్-smooth distribution of pensions in ap alternative employment for volunteers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment