అసలేం జరిగింది?గుర్తు తెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఆదివారం బాంబులు పేల్చడానికి ఇద్దరు వ్యక్తులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ కాల్ సెంటర్‌కు శనివారం రాత్రి ఓ నంబర్‌కు ఫోన్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు బాంబులు పేల్చడానికి ఎయిర్ పోర్టుకు వస్తున్నారని, రెండు బ్యాగ్‌లతో ఉన్నారని, ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేయాలని చెప్పాడు. ఈ విషయంపై ఎయిర్ పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ చేసిన వ్యక్తి హైదరాబాద్ కాచిగూడకు చెందిన ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. ఓ టీ స్టాల్ లో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, పక్కనున్న వ్యక్తి వారి మాటలు విని ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు విమానాశ్రయ ఎంట్రన్స్ వద్ద ముమ్మర తనిఖీలు చేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసుల తనిఖీల తర్వాత ఈ కాల్ ఫేక్ అని ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Source link