5-8 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Exam) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ఫలితాలను 5 – 8 వారాల్లో ప్రకటిస్తామని తెలిపింది. గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ ను జూన్/జులైలో నిర్వహించనున్నట్లు తెలిపింది.