Health Care

103 ఏళ్ల వయసులో 54 ఏళ్ల మహిళను మూడో పెళ్లి చేసుకున్న తాత!


దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో యువత.. ఉద్యోగం సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటున్నారు. మగవారికైతే పెళ్లి ఒక సమస్యగా మారింది. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ముందు తప్పనిసరిగా ఉద్యోగం ఉండాలి. ఏ అమ్మాయి తల్లిదండ్రులైన ముందుగా అబ్బాయికి జాబ్ ఉందా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా అబ్బాయిలు 30-35 ఏళ్లు వచ్చేదాకా పెళ్లి చేసుకోవడం లేదు. కానీ ఓ తాత 103 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో జనాలను ఆశ్యర్యపరుస్తున్నారు.

వివరాల్లోకెళ్తే.. ‘‘మధ్యప్రదేశ్‌కు చెందిన హబీబ్ నాజర్ అనే తాత వయసు 103 ఏళ్లు. గతంలో ఈయన రెండు వివాహాలు చేసుకున్నారు. పలు కారణాల వల్ల ఈ తాత ఒంటరిగా ఉంటున్నాడు. రీసెంట్‌గా ఇరు కుంటుంబాల సమక్షంలో హబీబ్ నాజర్ 54 ఏళ్లున్న ఫిరోజ్ జహాన్ అనే తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ.. హబీబ్ నాజర్ వివాహం చేసుకోవడం హ్యాపీగా ఉంది. స్వాతంత్య్ర సమరయోధుడైన ఈయనను పెళ్లి చేసుకోవడం సంతోషంగా అనిపిస్తుంది అని వెల్లడించింది. ఈ వయసులో వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి? అని అడగ్గా.. ‘నేను ఒంటరిగా ఉన్నానంటూ అమాయకంగా చెప్పుకొచ్చాడు నాజర్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వగా.. రసికుడంటే ఈ తాతనే అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Source link

Related posts

ఇంట్రెస్టింగ్..మనుషుల మూడ్ స్వింగ్స్ మారడానికి సీజన్‌కు లింక్..! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Oknews

షుగర్ పేషెంట్లు టీ తాగడం సురక్షితమేనా?

Oknews

సంబంధాల్లో సంఘర్షణ.. బలమైన అనుబంధానికి మరో మార్గం !

Oknews

Leave a Comment