ట్రైకోఫేజియాపాప కడుపులో దాదాపు 25 cm పొడవు 10 cm వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించారు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు.. దీనిని ట్రైకోఫేజియా (Trichophagia) అంటారని డాక్టర్ అన్వర్ తెలిపారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ (trichobezoar) అంటారని వివరించారు.
Source link