IPS Transfer in Telangana: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-2 ఐజీగా సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్థానంలో తరుణ్ జోషిని నియమితులయ్యారు. డిప్యూజీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్‌కు పోస్టింగ్ ఇవ్వగా.. కే నారాయణ్ నాయక్ కు సీఐడీ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు.
మరిన్ని చూడండి