అసలేం జరిగింది?
మాణిక్యరావు బాలిక ఫొటోలు, వీడియోలు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి ఆమెపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు అమ్మమ్మ తెలిపింది. లైంగిక వేధింపుల గురించి బయటపెడితే తండ్రిని, సోదరుడిని చంపేస్తానని మాణిక్ రావు బెదిరించినట్లు తనతో చెప్పేది అని బాధితురాలు అమ్మమ్మ తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న చిలకలగూడ పోలీసులు… బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసి మాణిక్ రావు పై POCSO చట్టం కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.