పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించారు. అలాగే జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు. తాజాగా ఓ పాత్రను రివీల్ చేశారు మేకర్స్.
అలనాటి అందాల తార శోభన ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె ‘మరియమ్’ గా అలరించనున్నారు. పోస్టర్ లో శోభన లుక్ విభిన్నంగా, ఆకట్టుకునేలా ఉంది.
కాగా, ‘కల్కి’ అనేది 18 ఏళ్ళ తర్వాత శోభన నటిస్తున్న తెలుగు సినిమా కావడం విశేషం. చివరిసారి తెలుగులో 2006 లో వచ్చిన ‘గేమ్’ చిత్రంలో కనిపించారు. ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ‘కల్కి’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
‘కల్కి’లో నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి పలువురు యంగ్ స్టార్స్ అతిథి పాత్రల్లో మెరవనున్నారట. విడుదలకు వారం రోజులే ఉండటంతో.. వీరి రోల్స్ ని కూడా రివీల్ చేసే అవకాశముంది అంటున్నారు. కాగా ముంబైలో బుధవారం సాయంత్రం కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.