సుమంత్ హీరో గా నటించిన అహాం రిబూట్ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో సూపర్ సక్సెస్ అందుకుంది. కేవలం ఓకే పాత్ర కనిపించే ఈ చిత్రంలో ఆర్జే నిలయ్ గా సుమంత్ నటన ఆకట్టుకుంది. జులై 1 నుండి డైరెక్ట్ గా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అహం రీబూట్ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతుంది. హీరో సుమంత్ కెరియర్ లో కూడా ప్రత్యేకంగా నిలిస్తుంది. ఒక ప్రయోగాత్మక చిత్రానికి ఇలాంటి నెంబర్స్ ని అందుకోవడం సూపర్ సక్సెస్ అనుకోవచ్చు.
వాయు పుత్ర ఎంటర్ టైన్మంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత రఘువీర్ గోరిపర్తి ఈ మూవీని నిర్మించారు. ఒక సింగిల్ క్యారెక్టర్ తో నడిచే ఈ చిత్రానికి గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుంది. జీవితంలో ఫెయిల్ అయి ఆర్జేగా పనిచేస్తున్న నిలయ్ కి ఒక రోజు తను పనిచేస్తున్న రెడియో స్టేషన్ కి రాత్రి వేళ ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. తను ఆపదలో ఉన్నాను కాపాడమంటుంది. అక్కడి నుండి మొదలైన నాటకీయ పరిణామాలు చాలా ఆసక్తిగా సాగాయి. సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ అంతా కేవలం వాయిస్ రూపంలోనే వినిపిస్తారు. ఇలాంటి కథా, కథనాలను రాసుకోని వాటిని అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శ కుడు ప్రశాంత్ అట్లూరి సక్సెస్ అయ్యారు. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ ని బ్రేక్ చేయకుండా గ్రిప్పింగ్ గా కథనం నడిపారు . దర్శకుడిగా ప్రశాంత్ కి చాలా పరిమితులు కథ రూపంలోనే ఎదురయ్యాయి. వాయిస్ లతో క్యారెక్టర్స్ ఎంత వరకూ రిజిస్టర్ అవుతాయి వాటి ఎమోషన్స్ ఎంత వరకూ కనెక్ట్ అవుతాయి అనే సందేహాలను తన స్క్రీన్ ప్లే తో సమాధానం చెప్పాడు. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ మూవీని ఒక కథ లా కంటే ఒక ఇన్సిడెంట్ లా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సుమంత్ నటన బాగుంది. కథలో జరుగుతున్న అన్ని సంఘటనల రియాక్షన్ తన మాత్రమే ఇవ్వాలి. ఈ జాబ్ ని చాలా ఎఫెక్టివ్ గా చేసాడు. అందుకే ఈ ప్రయోగాత్మక చిత్రం ఇప్పుడు సక్సెస్ పుల్ గా ఓటిటిలో ఆదరణ పొందుతుంది.
నిర్మాతగా తొలి చిత్రంతోనే రఘువీర్ తన అభిరుచిని చాటుకున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను నిర్మించాలంటే ముందు ధైర్యం చేయాల్సింది నిర్మాతలే. అలాంటి ధైర్యం ఉన్న నిర్మాతగా రఘువీర్ నిలిచాడు. దర్శకుడు ప్రశాంత్ విజన్ ని నమ్మి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుుకు మొదటి కారణం అయ్యాడు. దర్శకుడు ప్రశాంత్ ఈ కథను నడిపిన తీరుపై ప్రశంసలు అందుకుంటున్నారు.