Health Care

44 ఏండ్ల వ్యక్తితో.. 21 ఏండ్ల యువతి!.. అంతదానికే పెళ్లి ఎందుకంటూ..


దిశ, ఫీచర్స్ : ప్రేమకు వయస్సుతో పనేముంది?.. ఇది జస్ట్ డైలాగ్ మాత్రమే అనుకుంటాం. కానీ.. అప్పుడప్పుడూ అది నిజమేనని నిరూపించే సంఘటనలు కూడా మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. రీసెంట్‌గా అదే జరిగింది. ఒకటో, రెండో, మూడో కాదు, ఏకంగా తనకంటే 13 ఏండ్లు పెద్ద వయస్సు గల ఓ వ్యక్తిని.. జస్ట్ 21 ఏండ్ల ఏజ్ గల ఓ యువతి ప్రేమించింది. ప్రస్తుతం రొమాంటిక్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తోందట. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించింది. పైగా రిలేషన్‌షిప్‌ కొనసాగాలంటే ప్రేమ ఉండాలే కానీ.. ఇంతదానికే పెళ్లి చేసుకోవాలనేముంది? అంటూ మనసులోని మాటను ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరు?. ఏజ్ బార్ వ్యక్తితో లవ్‌లో ఎలా పడింది? అనే కదా మీ సందేహం!

యువతి పేరు ఎల్లీట్రాప్. వయస్సు 21. యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివాసం ఉంటోంది. ప్రస్తుతం తనకంటే 13 ఏండ్లు పెద్ద వయస్సు గల మార్క్ అనే వ్యక్తితో లవ్ అండ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉంది. పైగా అతడు తనను ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటాడని, బాగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. ఇటీవల థాయ్‌లాండ్ తీసుకెళ్లాడని, బర్త్‌ డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడని తెలిపింది. మరో సందర్భంలో హాలిడే ట్రిప్‌కు వెళ్లగా ఖరీడైన డిజైనర్ జ్యువెల్లరీ కొనిచ్చాడని వెల్లడించింది. ట్విస్ట్ ఏంటంటే.. తన ప్రియుడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, అందులో ఒకరి వయస్సు 12 సంవత్సరాలు కాగా, మరొకరి ఏజ్ 15 ఏండ్లు అని తెలిపింది. అందరం కలిసి త్వరలోనే స్పెయిన్‌కు టూర్ ప్లాన్ కూడా వేశామంటోంది. ప్రజెంట్ ఎల్లీట్రాప్, మార్క్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఎవరి పిచ్చి వారిది.. చేసేదేముంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.



Source link

Related posts

టీ తాగేటప్పుడు అదనంగా చక్కెర వేసుకుంటున్నారా?

Oknews

వీటితో బరువు సులభంగా తగ్గొచ్చు.. అవేంటో తెలుసా?

Oknews

యాలకులతో బీపీ కంట్రోల్ | Benefits With Cardamom

Oknews

Leave a Comment