Indian Cricketers Retire After Ranji Trophy 2024: దేశవాళీలో దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. 2023-2024 సీజన్ రంజీ ట్రోఫీ(Ranji Trophy)తో అయిదుగురు దేశవాళీ అగ్రశ్రేణి క్రికెటర్ల కెరీర్‌కు తెరపడనుంది. బెంగాల్ దిగ్గజం మనోజ్ మనోజ్ తివారి, ఝార్ఖండ్ ద్వయం సౌరభ్ తివారి, వరుణ్ ఆరోన్.. ముంబయి దిగ్గజం ధవల్ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ ఫయాజ్ ఫజల్‌లు దేశవాళీ కెరీర్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
మనోజ్ తివారీ గుడ్‌బై
పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary ) ఈ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో మ్యాచ్ తనకు చివరిదని మనోజ్ తివారీ ప్రకటించేశాడు. గతంలో ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కి తీసుకున్న మనోజ్ తివారీ… ఈసారి మాత్రం రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని తెలిపాడు. తన రంజీ కెరీర్.. ఈడెన్ గార్డెన్స్‌తో తనకున్న అనుబంధాన్ని చెప్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. 2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అయితే.. అతడికి కేవలం 12 వన్డేలు, 3 టీ20లు ఆడే అవకాశం వచ్చింది. భారత జట్టు తరఫున 2015లో జింబాబ్వేపై చివరి మ్యాచ్ ఆడేసిన తివారీ రంజీలపై దృష్టి పెట్టాడు. 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారీ… 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తివారీ ఐపీఎల్‌లో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
Also Read: మహమ్మద్ షమీ ఫేవరేట్ తెలుగు హీరోలు ఎవరంటే!
విదర్భ ఓపెనర్ కూడా.,..
విదర్భ ఓపెనర్ ఫయజ్ ఫజల్ కూడా ప్రొఫెషన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. హర్యానాతో మ్యాచ్ ముగిశాక ఫజల్ ఆటకు గుబ్ చెప్పేశాడు. దాంతో, 21 ఏండ్ల అతడి సుదీర్ఘ కెరీర్‌కు తెరపడింది. తన జర్నీ ఒక మర్చిపోలేని అనుభవమని ఫజల్ అన్నాడు. ఫజల్ సారథ్యంలోనే విదర్భ జట్టు 2017-18లో రంజీ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఆ మరుసటి సీజన్‌లో ఫజల్ సేన డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకుంది. 2016లో జింబాబ్వే పర్యటనకు సెలెక్టర్లు పంపిన రెండో జట్టులో ఫజల్‌కు చోటు దక్కింది. ఫజల్ 137 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9,183 రన్స్ కొట్టాడు. అతడి ఖాతాలో 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏలో ఈ లెఫ్ట్ హ్యాండర్ 1,273 పరుగులు చేశాడు.
మరికొందరు దిగ్గజాలు కూడా
దేశంలో ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన వరుణ్ ఆరోన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. అరోన్ 66 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 173 వికెట్లు పడగొట్టాడు. కులకర్ణి కూడా తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. కులకర్ణి 95 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 281 వికెట్లు సాధించాడు. ఇక సౌరభ్ తివారి 116 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 8076 పరుగులు సాధించాడు. ఈ అయిగురు ఆటగాళ్లు కూడా భారత జట్టుకు ఆడారు.