సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ సినిమా.. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.
కామారెడ్డి, జనగామ, బీబీపేట, ఇస్సానగర్ ప్రాంతాల్లో.. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల మూడు సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 11 నుండి నూతన షెడ్యూల్ ప్రారంభం కానుంది.
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది.
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్.బి శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు.