చంద్రబాబుకు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాబును విచారించారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని బాబు న్యాయమూర్తికి తెలిపారు. నా బాధ, ఆవేదనంతా అదేనని చెప్పారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసన్న చంద్రబాబు వివరించారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని జడ్జి తెలిపారు. చట్టం అందరికీ సమానమేనని చంద్రబాబుకు జడ్జి బదులిచ్చారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. రిమాండ్ ను శిక్షగా భావించొద్దని, ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం అన్నారు.