Uncategorized

Minister Roja: ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఎదిగా, నా క్యారెక్టర్ జడ్జి చేయడానికి మీరెవరు?


రోజాకు బుద్ధి చెప్పాలనే అలా మాట్లాడాను- బండారు

మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు, అరెస్టు వ్యవహారంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ స్పందించారు. ఈ కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో తన వైపు నిలబడిందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన…ఉరిశిక్షకైనా సిద్ధం తప్ప సీఎం జగన్ దుర్మార్గపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ నాలుగు నెలలైనా బుద్ధిమార్చుకుంటే జగన్‌కే మంచిదన్నారు. నా సంతకం ఫోర్జరీ అయితే ఆ విషయం నేను చెప్పాలి కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. మహిళల పట్ల తనకు గౌరవం ఉందన్నారు. గౌరవంతో బతికే కుటుంబాలపై మంత్రి రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆమెకు బుద్ధి చెప్పాలనే అలా మాట్లాడానన్నారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారన్నారు. మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను సీఎం కూడా విశ్లేషించుకోవాలన్నారు.



Source link

Related posts

కోట్లలో ట్రాఫిక్ చలాన్ల సొమ్ము కొట్టేసిన మాజీ డీజీపీ అల్లుడు-former dgps son in law diverted traffic challan money worth crores of rupees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఆధార్ కార్డుల వంకతో తరచూ ఇంటికి, పదో తరగతి బాలికపై వాలంటీర్ అత్యాచారం!-eluru district denduluru volunteer molested tenth class student ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జనసేనతో ఉమ్మడి కార్యక్రమాలు, టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు!-amaravati tdp formed five members coordination committee for janasena combined programmes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment