ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే… సీబీఐకి కేసును బదిలీ చేయాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు… నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటిసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది . ఈ కేసులో వాస్తవాలను దర్యాప్తు చేయాలని పిటిషన్ తరుపు న్యాయవాది వాదించారు. ఈడీ, ఐటీ, సీఐడీ కూడా ఈ కేసు విచారణ చేస్తుంది కాబట్టి వాస్తవాలు సీబీఐకి ఇస్తే బయటకు వస్తాయని వాదనలు వినిపించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదిస్తూ… సీబీఐకి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు.