Andhra Pradesh

చంద్రబాబుకు స్కిన్ అలర్జీ, ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక!-rajahmundry tdp chief chandrababu suffering with dehydration skin allergy govt doctors report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Chandrababu Health : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల జైలులో డీహైడ్రేషన్ గురైన చంద్రబాబు… తాజాగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. అయితే పోలీసులు చెబుతున్న విషయాలకు భిన్నంగా వైద్యుల నివేదిక ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు చేతులు, మెడ, ఛాతీ, గడ్డం, వీపు భాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాలతో వైద్యులు జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఐదు రకాల మెడిసన్ ను వైద్యులు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.



Source link

Related posts

Road Accidents : ఎన్టీఆర్ జిల్లాలో ఒకే చోట మూడు రోడ్డు ప్రమాదాలు

Oknews

Tirumala : భక్తులకు అలర్ట్… తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం

Oknews

CM Chandrababu : తక్షణమే రోడ్ల మరమ్మతు పనులు చేపట్టండి

Oknews

Leave a Comment