GossipsLatest News

Hanuman Donates 2.66 Cr for Ayodhya Ram Mandir 2 కోట్లకు పైగా.. రాముని కోసం హనుమాన్



Sun 21st Jan 2024 01:01 PM

hanuman for shreeram  2 కోట్లకు పైగా.. రాముని కోసం హనుమాన్


Hanuman Donates 2.66 Cr for Ayodhya Ram Mandir 2 కోట్లకు పైగా.. రాముని కోసం హనుమాన్

సీతమ్మ జాడ కనుక్కుని.. లంక నుండి ఆమెను తీసుకువచ్చే వరకు శ్రీరామునికి అండగా హనుమంతుడు ఉన్నట్లుగా పురాణాలు చెబుతాయి. అందుకే ఆ రామునికి హనుమంతుడిని మించిన భక్తుడు లేడని అంటారు. ఇప్పుడు దేశం మొత్తం రామజపంతో నిండిపోయింది. అయోధ్యలో నూతనంగా రూపుదిద్దుకున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. అయితే ఈ రామునికి కూడా హనుమంతుడు అండగా ఉంటున్నాడు.. అదెలా అనుకుంటున్నారా?

రీసెంట్‌గా సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా, లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు.. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే.. ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో.. మెగాస్టార్ చిరంజీవి చేత మేకర్స్ ఓ ప్రకటన చేయించారు. ఈ సినిమాకు విక్రయించే ప్రతి టికెట్ నుండి రూ. 5 చొప్పున పక్కన పెట్టి.. అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామనే నిర్ణయాన్ని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.

హనుమాన్ మేకర్స్ ప్రకటించినట్లుగానే ఇప్పటి వరకు ఈ సినిమాకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055ను అయోధ్య రామమందిరం కోసం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రీమియర్ షోలకు విక్రయించిన 2,97,162 టిక్కెట్లకుగానూ రూ. 14,85,810 చెక్కును అయోధ్య రామమందిరానికి ఇప్పటికే అందజేసిన మేకర్స్.. ఇప్పటి వరకు అమ్ముడైన మొత్తం టికెట్ల లెక్క చెబుతూ.. 2 కోట్ల 66 లక్షల 41 వేల 55 రూపాయలను అయోధ్య రామునికి ఇచ్చారు.


Hanuman Donates 2.66 Cr for Ayodhya Ram Mandir:

Hanu Man For Shreeram Donates From Ticket Prices For Ayodhya Ram Mandir









Source link

Related posts

‘భక్షక్’ మూవీ రివ్యూ

Oknews

మాఫియా చేతుల్లోకి ప్రభాస్ కల్కి.. టికెట్ బుకింగ్ లో సరికొత్త స్కామ్ 

Oknews

Guntur Kaaram 5 days collections గుంటూరు కారం 5 డేస్ కలెక్షన్స్

Oknews

Leave a Comment